LightningAlert | ఎందుకు.. ఎప్పుడు.. ఎలా ప‌డ‌తాయో తెలుసా?

LightningAlert | ఎందుకు.. ఎప్పుడు.. ఎలా ప‌డ‌తాయో తెలుసా?

LightningAlert | పిడుగుపాటుతో కానిస్టేబుల్ మృతి.. కలచివేసిన ఘటన
పిడుగు అంటే ఏమిటి?
పిడుగు ఎలా ఏర్పడుతుంది?
వర్షాకాలంలో పిడుగులు ఎందుకు ఎక్కువగా పడతాయి?
పిడుగులు చెట్లపై ఎందుకు పడతాయి?
పిడుగు ఎంత శక్తివంతమైంది?
పిడుగు నుంచి ఎలా రక్షించుకోవాలి?
లైట్నింగ్ కండక్టర్, అరెస్టర్ ఉపయోగాలు
పిడుగు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

LightningAlert | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : వర్షాకాలంలో తరచుగా కనిపించే ప్రకృతి ఘటనల్లో పిడుగులు (Lightning) ఒకటి. ఇవి భయంకరమైన శబ్దం, కాంతితో పాటు ప్రాణాంతక ప్రమాదాన్ని కూడా కలిగించగలవు. పిడుగులు సహజ ప్రకృతి సంఘటన అయినప్పటికీ, అవి అత్యంత శక్తివంతమైనవి మరియు ప్రమాదకరమైనవి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం నుంచి రక్షించుకోవచ్చు. వర్షాకాలంలో అప్రమత్తతే అత్యుత్తమ రక్షణ. అసలు పిడుగులు ఎందుకు పడతాయి, ఎలా ఏర్పడతాయి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలను శాస్త్రీయంగా తెలుసుకోవడం ఎంతో అవసరం.

పిడుగు అంటే ఏమిటి?
ఆకాశంలో మేఘాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు విద్యుత్ ఆవేశాలు (ఫొసితివె అంద్ ణెగతివె చర్గెస్) ఏర్పడతాయి. ఈ అసమతుల్యత కారణంగా భారీ మొత్తంలో విద్యుత్ శక్తి భూమిపై ఉన్న ఎత్తైన ప్రదేశాలు లేదా చెట్ల వైపు వేగంగా ఆకర్షితమై దూసుకురావడాన్ని పిడుగు అంటారు.

వర్షం పడే సమయంలో మేఘాలలో గాలి ప్రవాహం వల్ల నీటి బిందువులు, మంచు కణాలు వేగంగా కదులుతాయి. వీటి రాపిడి వల్ల మేఘాల పైభాగంలో ధనావేశం (+), కింది భాగంలో రుణావేశం (-) ఏర్పడతాయి. మేఘాల కింది భాగంలో రుణావేశం (- చార్జ్) పేరుకుపోవడం వల్ల, భూమి ఉపరితలంపై ధనావేశం (+) ఏర్పడుతుంది. మేఘాలలోని రుణావేశం, భూమిపై ఉండే ధనావేశాన్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని వెతుకుతుంది. ఆవేశాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి బంధకాన్ని (ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్) దాటుకుని విద్యుత్ ప్రవాహం భూమిని చేరుకుంటుంది. దీనినే మనం ‘పిడుగు పడటం’ అంటాం.

పిడుగు ఎలా ఏర్పడుతుంది?
మేఘాల్లో నీటి ఆవిరి, మంచు కణాలు, గాలి ఘర్షణ వల్ల విద్యుత్ ఛార్జీలు (ధన, ఋణ విద్యుత్) ఏర్పడతాయి. మేఘంలో ఈ ఛార్జీలు అసమతుల్యంగా మారినప్పుడు, అధిక వోల్టేజ్ విద్యుత్ విడుదల జరుగుతుంది. అదే పిడుగు (ళిఘ్త్నింగ్). ఈ విద్యుత్ విడుదల మేఘాల మధ్యగానీ, మేఘం నుంచి భూమికి గానీ జరుగుతుంది.

వర్షాల సమయంలోనే పిడుగులు ఎందుకు పడతాయి?
వర్షాకాలంలో మేఘాలు భారీగా, నీటి ఆవిరితో నిండుగా ఉంటాయి. గాలి ప్రవాహాలు బలంగా ఉండటం వల్ల ఘర్షణ ఎక్కువగా జరుగుతుంది. దీంతో విద్యుత్ ఛార్జీలు వేగంగా ఏర్పడి పిడుగులు ఎక్కువగా కనిపిస్తాయి.

పిడుగులు చెట్లపై ఎందుకు పడతాయి?
పిడుగు ఎల్లప్పుడూ భూమికి చేరడానికి తక్కువ ప్రతిఘటన (లో రెసిస్టెన్స్) ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎత్తైన చెట్లు భూమికి దగ్గరగా ఉన్న విద్యుత్ మార్గాన్ని అందిస్తాయి కాబట్టి పిడుగులు ఎక్కువగా వాటిపై పడతాయి.

పిడుగు ఎంత శక్తివంతమైంది?
పిడుగు అత్యంత శక్తివంతమైన ప్రకృతి విద్యుత్ ఉత్సర్గ. దీని ఉష్ణోగ్రత సుమారు 30,000°సి వరకు ఉండవచ్చు. ఇది సూర్య ఉపరితల ఉష్ణోగ్రత కంటే కూడా ఎక్కువ. అందుకే ఇది మనిషి ప్రాణాలకు అత్యంత ప్రమాదకరం.

పిడుగు ప్రాణాంతకమా?
పిడుగు ప్రాణాంత‌క‌మే. పిడుగు నేరుగా తాకినా, సమీపంలో పడినా కూడా తీవ్రమైన గాయాలు లేదా మరణం సంభవించవచ్చు. అందుకే దీనిని అత్యంత ప్రమాదకరమైన సహజ విపత్తుగా పరిగణిస్తారు.

పిడుగు నుంచి రక్షణ ఎలా పొందాలి?

  • చెట్ల కింద నిలబడకూడదు
  • ఓపెన్ ఫీల్డ్స్‌లో ఉండకూడదు
  • లోహ వస్తువులు పట్టుకోవద్దు
  • మొబైల్ టవర్స్, ఎత్తైన నిర్మాణాల దగ్గర ఉండకూడదు
  • సురక్షిత భవనంలో లేదా కాంక్రీట్ ఇంట్లో ఉండాలి
  • ఎలక్ట్రిక్ పరికరాలను ఆఫ్ చేయాలి

లైట్నింగ్ కండక్టర్, అరెస్టర్ ఎందుకు ఉపయోగిస్తారు?
ఎత్తైన భవనాలు, టవర్లను పిడుగుల నుంచి రక్షించడానికి లైట్నింగ్ కండక్టర్లు (లైటింగ్ కండక్టర్లు) ఏర్పాటు చేస్తారు. ఇవి పిడుగు విద్యుత్‌ను భూమిలోకి సురక్షితంగా పంపిస్తాయి. అదే విధంగా విద్యుత్ వ్యవస్థల్లో లైట్నింగ్ అరెస్టర్లు ఉపయోగించి అధిక వోల్టేజ్‌ను నియంత్రిస్తారు.

విమానాలపై పిడుగులు పడతాయా?
విమానాలు లోహపు బాహ్య పొర (మెటల్ బాడీ) కలిగి ఉండటంతో, పిడుగు విద్యుత్ విమానం బయట భాగం గుండా ప్రవహించి బయటకు వెళుతుంది. అందుకే సాధారణంగా ప్రయాణికులకు ప్రమాదం ఉండదు.

పిడుగు పడటం ముందే గుర్తించవచ్చా?
పిడుగును ఖచ్చితంగా ఎక్కడ పడుతుందో ముందే చెప్పడం కష్టం. అయితే వాతావరణ శాఖలు రాడార్, ఉపగ్రహాల సహాయంతో పిడుగు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే హెచ్చరిస్తాయి.

పిడుగు పడినప్పుడు ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతింటాయా?
అవును. పిడుగు వల్ల అధిక వోల్టేజ్ విద్యుత్ ప్రవాహం ఏర్పడి టీవీలు, ఫ్రిజ్‌లు, కంప్యూటర్లు వంటి పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే పిడుగు సమయంలో ప్లగ్‌లు తీసేయడం మంచిది.

CLICK HERE TO READ బందోబస్తు ముగించుకుని వస్తుండగా విషాదం..

CLICK HERE TO READ MORE

Leave a Reply