2వ వార్డు బిజెపి అభ్యర్థి టప్ప కృష్ణ గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 2వ వార్డు అభ్యర్థిగా బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన టప్ప కృష్ణ విజయం సాధించారు. కాంగ్రెస్ బిజెపి మధ్య పోరాహోరుగా సాగిన పోరులో బిజెపి అభ్యర్థి టప్ప కృష్ణ కు 651 ఓట్లు లభించాయి. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్ధి నాగరాజు మిస్కిన్ 578 ఓట్లు లభించాయి. దీంతో బిజెపి అభ్యర్థి టప్ప కృష్ణ 73 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
