మొక్క జొన్న కొనుగోలు ఆలస్యం జరిగితే కఠిన చర్యలు

మొక్క జొన్న కొనుగోలు ఆలస్యం జరిగితే కఠిన చర్యలు

రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ , ఆంధ్రప్రభ: నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. గన్ని బ్యాగుల కొరత మంత్రి దృష్టికి తేగా వెంటనే మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలత కి ఫోన్ చేసి గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. మొక్క జొన్న కొనుగోలు ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Leave a Reply