25aprilchintana భ్రాంతి నుండి సత్యం వైపు: శాశ్వత ఆనందం, నిజమైన శాంతి ఎలా పొందాలి?

25aprilchintana భ్రాంతి నుండి సత్యం వైపు: శాశ్వత ఆనందం, నిజమైన శాంతి ఎలా పొందాలి?

25aprilchintana ఆనందం అంటే ఏమిటి?
సచ్చిదానందం – అంతరాత్మ అనుభూతి
నిష్కామ కర్మ, ధ్యానం ప్రాధాన్యం
అసలైన శాంతి ఎలా పొందాలి?
అశాంతి కారణాలు మరియు పరిష్కారం

25aprilchintana మానవ జీవితం నిరంతరం ఏదో ఒక వెతుకులాటలోనే సాగుతుంటుంది. కొందరు ధనం కోసం, మరికొందరు కీర్తి కోసం, ఇంకొందరు భౌతిక సుఖాల కోసం అన్వేషిస్తుంటారు. కానీ వీటన్నింటి వెనుక ఉన్న అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే అది ‘ఆనందం‘. అయితే, లౌకిక విషయాల ద్వారా పొందే ఆనందం క్షణికం. శాశ్వతమైన, పరిపూర్ణమైన ఆనందాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో ‘ఆనందామృతం‘ అంటారు.

సాధారణంగా మనం కోరుకున్నది జరిగినప్పుడు కలిగే స్థితిని ఆనందం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక కోణంలో ఆనందం అనేది బయటి వస్తువుల మీద ఆధారపడి ఉండదు. ఇది మన అంతరాత్మకు సంబంధించిన సహజ స్థితి. వస్తువులు, వ్యక్తులు, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి మారినప్పుడు ఆనందం పోయి దుఃఖం కలుగుతుంది. ఏ బాహ్య కారణం లేకుండానే మనసులో కలిగే ప్రశాంతత. దీన్నే ‘సచ్చిదానందం‘ అని కూడా పిలుస్తారు.

25aprilchintana
25aprilchintana

పరమాత్మపై నిష్కల్మషమైన ప్రేమను పెంచుకోవడం. భగవంతుడిని స్మరించడం, కీర్తించడం ద్వారా మనసులోని కల్మషాలు తొలగిపోతాయి. భక్తుడు తనను తాను భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు కలిగే తన్మయత్వమే అమృత సమానం. ”నేను ఎవరు?” అనే అన్వేషణ. శరీరం, మనస్సు, బుద్ధి కంటే అతీతమైన ‘ఆత్మ‘ను నేను అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ ప్రపంచం అనిత్యం, ఆత్మ ఒక్కటే సత్యం అని గ్రహించినప్పుడు ఏ కష్టమూ మనల్ని కుంగదీయదు. ఫలాపేక్ష లేకుండా పని చేయడం. చేసే పనిని దైవ కార్యంగా భావించడం వల్ల మనస్సు రాగద్వేషాలకు అతీతంగా మారుతుంది. ఈ నిష్కామ కర్మ చిత్తశుద్ధిని, తద్వారా శాంతిని ఇస్తుంది.

ఆనందామృతాన్ని రుచి చూడాలంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి. సముద్రం అలలు లేకుండా ఉన్నప్పుడే దాని లోతు కనిపిస్తుంది. అలాగే మనస్సు ఆలోచనలు లేని మౌన స్థితిలో ఉన్నప్పుడే అంతరాత్మలోని ఆనందం అనుభవంలోకి వస్తుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం వల్ల అంతర్గత ప్రయాణం సులభతరం అవుతుంది.

ఆనందామృతం అనేది ఎక్కడో ఆకాశంలోనో, అడవుల్లోనో లేదు. అది మనలోనే ఉంది. అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) వదిలి, అహంకారాన్ని తగ్గించుకున్నప్పుడు మన హృదయం ఆనంద నిలయమవుతుంది. నిరంతర సాధన, సేవాభావం, దైవచింతన అనే పాత్రలతో ఆ అమృతాన్ని మనం నిత్యం గ్రోలవచ్చు. ఆనందామృతాన్ని గ్రోలాలంటే కావాల్సింది శాంతి. అయితే శాంతి లేనిదే ఆనందం లేదు, ఆనందం లేనిదే అమృతత్వం లేదు.

లోకంలో మనం చూసే శాంతి వేరు, ఆధ్యాత్మికంగా మనం వెతకాల్సిన అసలైన శాంతి వేరు. యుద్ధాలు లేకపోవడమో, శబ్దాలు లేకపోవడమో శాంతి కాదు. అది కేవలం బయటి నిశ్శబ్దం మాత్రమే. మరి అసలైన శాంతి అంటే ఏమిటి? అది మనకు ఎలా లభిస్తుంది?

చాలామంది ప్రశాంతత కోసం విహారయాత్రలకు వెళ్తుంటారు. కానీ తిరిగి రాగానే పాత అశాంతి మళ్ళీ మొదలవుతుంది. దీనికి కారణం శాంతి అనేది ఒక ప్రదేశానికి సంబంధించినది కాదు, అది మనసు స్థితి. తుఫాను లాంటి కష్టాల మధ్య కూడా చెక్కుచెదరకుండా ఉండటమే అసలైన శాంతి.

మనసును వర్తమానంపై లగ్నం చేయడమే శాంతికి మొదటి మెట్టు. గతాన్ని తలుచుకుని బాధపడటం, భవిష్యత్తుపై భయం కలగడం వల్ల మనం ప్రశాంతతను కోల్పోతాము.

మనలో అశాంతికి కారణం ‘కోరికలు, అంచనాలు‘. ఇవి నెరవేరకపోతే క్రోధం, అలజడి పెరుగుతాయి. అహంకారం తగ్గిన చోట, ప్రేమ నిండిన చోట శాంతి స్వయంగా వెలుగుతుంది. క్షమించడం వల్ల మనసు తేలికపడుతుంది.

శాశ్వతమైన ఆనందం అంటే కొత్తదాన్ని సంపాదించడం కాదు. అజ్ఞానపు పొరలను తొలగించడం. భ్రాంతి తొలగినప్పుడు సత్యం స్పష్టమవుతుంది. బాహ్య ప్రపంచపు సందడి తగ్గితే, ఆనందామృతం మనకే దక్కుతుంది.

-తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి

click here to read more

click here to read  ప్రేమ, ధర్మం, శాంతి.. సత్యసాయి బోధనలు