25thaprilsplstory సర్వం ఏఐ? ఉద్యోగాలకు ముప్పు

25thaprilsplstory సర్వం ఏఐ? ఉద్యోగాలకు ముప్పు

25thaprilsplstory ప్రపంచాన్ని మార్చుతున్న ఏఐ శక్తి
ఏఐ దుర్వినియోగం – భయంకర ఉదాహరణలు
బాధ్యతాయుత ఏఐ అవసరం
నిరుద్యోగంపై ఏఐ ప్రభావం
భవిష్యత్తులో మానవ-ఏఐ సమతౌల్యం

25thaprilsplstory అటు అమెరికా ఇటు చైనాల ఆదిపత్య ధోరణులను భారత్‌ ఎదుర్కోవాలంటే ఏఐ అభివృద్ధిని తనదైన శైలితో అభివృద్ధిపరిచి ప్రపంచ దేశాలను నడిపించగలిగే శక్తిగా, మార్గదర్శిగా భారత్‌ కాగలదా? పారిశ్రామిక విప్లవం నుండి ఐటీ రంగం వరకు జరిగినవన్నీ సాంకేతిక విప్లవాలు ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన నాగరికత కూడా ప్రపంచ దేశాల దిశా దశ మార్చబోయే శక్తిగా ఉన్నది. ఇప్పటివరకు ఐటీ రంగంలో ప్రపంచ దేశాలకు వెన్నెముకగా ఉన్న మన నిపుణులు ఇప్పుడు ఏఐ రంగంను కూడా నడిపించగలగాలి.

ఆనాడు ఐఐటీలను స్థాపించగలిగినందువలన ఈనాడు ఐటీ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా మనవారు ఉన్నారు ఈ పునాదుల పైననే ఏఐ రంగాన్ని కూడా మనం శాసించగలగాలి. లేకపోతే అమెరికా చైనా ఆధిత్య దోరలను అరికట్టలేము. ఏఐ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు అత్యవసరమైన వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థులు ఒంటబట్టించుకునే విధంగా దేశంలోని విద్యా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. ఏఐకి భారత్‌ క్యాపిటల్‌ కావాలి. ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మనమే ముందుండాలి. మనకు కావలసినంత డెమోగ్రాఫిక్‌ డివిడెంట్‌, సాంకేతిక నిపుణత మన దేశానికి ఉంది. కావలసినదల్లా ప్రభుత్వ పాలన సహాయ సహకారాలు మాత్రమే.

25thaprilsplstory
25thaprilsplstory

మన ప్రధాని ఏఐ రంగాన్ని దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని, ఇది మానవ కేంద్రీకృతంగా, సమ్మిళిత అభివృద్ధి గాను ఉండాలని ఢిల్లీలో జరిగిన ఏఐ ప్రభావము అనే సదస్సులో నొక్కి చెప్పడం జరిగింది. అయితే అత్యంత అమానవీయ పద్ధతులలో కుత్రిమ మేధా సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా ఇజ్రాయిల్‌ యుద్ధం యొక్క పర్యవసానాలు నేడు చూస్తున్నాము. ఓపెన్‌ ఏఐ, పాలంటీర్‌, ఆంత్రోపిక్‌ వంటి వ్యవస్థల ఆధారంగా ఈ మారణహోమం జరిగిందనే ఉదాహరణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక పాఠశాలను సైనిక స్థావరంగా భావించి జరిగిన దాడిలో నిరపరాధ పిల్లల ప్రాణనష్టం వంటి ఘటనలు ఏఐ దుర్వినియోగాన్ని భయంకరంగా చూపిస్తున్నాయి.

కృత్రిమ మేధస్సు పరిశోధనా రంగంగా ప్రారంభమై, ఇప్పుడు ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రాథమిక సాంకేతికతగా వేగంగా అభివృద్ధి చెందింది. ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, విద్య, భద్రత వంటి కీలక రంగాల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలు కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యతాయుత అభివృద్ధి, పరిపాలన అత్యంత అవసరంగా మారింది. ఏఐ వినియోగం నైతికత, పారదర్శకత, సామాజిక విలువలకు అనుగుణంగా ఉండాలి.

ఏఐ వ్యవస్థలు ప్రజాప్రయోజనాలకు హాని లేకుండా, పక్షపాతం తగ్గించేలా, గోప్యతను రక్షించేలా, సమానత్వం, భద్రతను ప్రోత్సహించేలా ఉండాలి. ఇది కేవలం సాంకేతిక పనితీరుకే పరిమితం కాకుండా, సమాజంపై విస్తృత ప్రభావం, చట్టపరమైన అనుసరణ, నైతిక సమన్వయం కలిగి ఉండాలి. ముఖ్యంగా మానవ హక్కులు, న్యాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి చెందుతున్న ఏఐ ద్వారా నిరుద్యోగ సమస్య పెరగకూడదు. కానీ వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఏడాది కేటాయించిన నిధులు తగ్గడం ఆందోళనకరం. ఏఐ ప్రవేశం వలన దేశంలో లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనాలు ఉన్నాయి. మానవ శ్రమను రోబోలు ఆక్రమిస్తుంటే, మేధా శ్రమను ఏఐ కైవసం చేసుకుంటోంది. ఫలితంగా ఉద్యోగాలు కోల్పోవడం, లేఆఫ్స్‌ పెరగడం వంటి సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి.

ఉదాహరణకు అమెజాన్‌ వంటి సంస్థలు వేలాది ఉద్యోగులను తొలగించడం, గూగుల్‌ వంటి సంస్థలు కోడింగ్‌ను ఏఐతో చేయించడం వల్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. ఖర్చులు తగ్గించేందుకు కార్పొరేట్‌ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు మానవ శ్రేయస్సుకు విరుద్ధం.

సర్వం ఏఐ కాకూడదు. మనిషి స్థానాన్ని పూర్తిగా ఏఐ భర్తీ చేస్తే నిరుద్యోగ సంక్షోభం పెరుగుతుంది. సాంకేతిక అభివృద్ధి మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడాలి, కీడు కలిగించే విధంగా కాకూడదు. ప్రభుత్వం ముందడుగు వేసి ఈ సమస్యలను నియంత్రించాలి.

-డాక్టర్‌ ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజ్‌

click here to read more

click here to read హార్ముజ్‌పై ఆధిపత్య పోరు.. తీవ్ర హెచ్చరికలు

Leave a Reply