25 kg rice | ఆర్థిక సహాయం అందజేత

25 kg rice | ఆర్థిక సహాయం అందజేత
25 kg rice | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఇటీవల శ్రీరామోజు సత్యనారాయణ చారి ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.
స్పందించిన ఇండియన్ రెడ్ క్రాస్(Indian Red Cross) చైర్మన్ డా గుర్రం లక్ష్మీనరసింహా రెడ్డి వంట సామగ్రి, దుప్పట్లు, 25 కిలోల బియ్యం(25 kg rice), ఎన్ ఆర్ ఐ పోచం మధు అందించిన రూ. 5000 ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా డైరెక్టర్ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బొల్లు యాదగిరి, కళ్లెం నర్సయ్య, పొలినేని స్వామి రాయుడు, రెడ్ క్రాస్ యూత్ జిల్లా అధ్యక్షులు బీసు మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.
