పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా

  • సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి పెరుగుతున్న ఆదరణ
  • తుంపాల వరప్రసాద్, విక్రమ్ రామ్మోహన్‌తో పాటు 207 మంది టీడీపీలో చేరిక

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ: సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం నందు 30వ డివిజన్ దేవినగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు తుంపాల వరప్రసాద్, విక్రమ్ రామ్మోహన్‌తో పాటు 207 మంది అనుచరులు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతం అవుతుందని, ప్రజలకు చేరువగా ఉండి సేవ చేయాలనే సంకల్పంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు.

పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తన సొంత నిధులతో అండగా నిలుస్తూ, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుంపాల వరప్రసాద్ తన మిత్రబృందం, అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. తుంపాల వరప్రసాద్, విక్రమ్ రామ్మోహన్‌తో పాటు 207 మంది కార్యకర్తలు పార్టీలో చేరడం వల్ల 30వ డివిజన్‌లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్‌ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత,డివిజన్ అధ్యక్షుడు లక్కంరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.