సహకార పరపతి సంఘం సొసైటీ ప్రారంభోత్సవం

పెడన, ఆంధ్రప్రభ ; పెడన మండలం దావోజిపాలెం గ్రామంలో శనివారం రోజున 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితం కానున్న నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ భవనం పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకొని పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రైతులు సులభంగా రుణాలు పొంది, వ్యవసాయం అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. దావోజిపాలెం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మితం కాబోతున్న ఈ భవనం రైతుల సమస్యలకు పరిష్కారం కల్పించడంతో పాటు సహకార రంగాన్ని మరింత బలపరుస్తుంది” అని తెలిపారు.