కవ్వాల టైగర్ రిజర్వ్‌లో పర్యటించిన శిక్షణ ఐఏఎస్‌లు..

కవ్వాల టైగర్ రిజర్వ్‌లో పర్యటించిన శిక్షణ ఐఏఎస్‌లు..

శిక్షణలో భాగమే పర్యటన..

జన్నారం, ఆంధ్రప్రభ : శిక్షణలో భాగంగా తెలంగాణ దర్శన్ పేరుతో 2025 బ్యాచ్ శిక్షణ ఐఏఎస్ అధికార్లు కవ్వాల టైగర్ రిజర్వ్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు.ట్రేనీ ఐఏఎస్ అధికార్లు సచిన్ బసవరాజు, ఇ.సాయిశివాని, సురేష్ పామూరి, పి.హరిప్రసాద్ ల బృందం అటవీ శాఖ సఫారీ వాహనాల్లో మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ లోని వన్యప్రాణులను వీక్షిస్తూ, తాళ్లపేట రేంజ్ లోని మల్యాల వాచ్ టవర్ ఎక్కి అడవుల అందాలను పరిశీలించారు.

ఆ తర్వాత జన్నారం రేంజ్ లోని బైసన్ కుంట, నీలుగాయిసోలార్ కుంట, పలు ప్రాంతాల్లోని ప్రదేశాలను ట్రేనీ అధికారులు పరిశీలించారు. బర్డ్ వాచ్ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. రిజర్వ్ ఫారెస్ట్ లోని పలు రకాల చెట్లను, వన్యప్రాణులను వారు పరిశీలిస్తూ, ఎకో టూరిజం కార్యక్రమం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ట్రేనీ అధికార్ల వెంట స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, దండేపల్లి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పి.రాము, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు బి.భోజనాయక్, శ్రీకాంత్, అజీజ్ ఉన్నారు.