జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ ..

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ ..

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జాహిరాబాద్‌ పరిధి లింగంపల్లిలోని టీజీఆర్ఎస్ అండ్ జూనియర్ కాలేజీలో అండర్-14 బాలురు, బాలికల ఎంపిక ట్రయిల్స్ నిర్వహించారు. ఈ ట్రయిల్స్‌లో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

నిర్వహించిన ఎంపికల్లో బాలుర విభాగంలో 18 మంది, బాలికల విభాగంలో 18 మంది ఆటగాళ్లను తుది జట్టుగా ఎంపిక చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల ఏప్రిల్ 28 నుంచి 30 వరకు నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొననుంది. ఈ విషయాన్ని జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన వేణుగోపాల్, ఉపాధ్యక్షులు సుధాకర్ పీడీ, రమాదేవి పీడీ, ప్రకాష్ పీడీ, ప్రధాన కార్యదర్శి ఆర్.సరిత, సంయుక్త కార్యదర్శులు సురేష్, వశిరం, సరిత, పార్వతి, ఖజాంచి నాగేష్, సీనియర్ క్రీడాకారులు విజయ్ నాయక్, రవికుమార్, కోచ్ తరుణ్ వెల్లడించారు.

Leave a Reply