10th Results : వావ్​.. బీసీ బిడ్డల అద్భుతం Andhra Prabha Top News

10th Results : వావ్​.. బీసీ బిడ్డల అద్భుతం Andhra Prabha Top News

  • ఎంజేపీ గురుకులాలకి స్టేట్ సెకండ్ ప్లేస్
  • 30 గురుకులాల్లో 100 శాతం ఉత్తీర్ణత
  • ఇది మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సత్తా
  • టాప్​లో నెరవాడ విద్యార్థులు
  • ఇక 596, 593 మార్కులతో నయా హిస్టరీ
  • మంత్రి సభిత అభినందనలు

(ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో )

10th Results

10th Results : ఏపీ పదో తరగతి ఫలితాల్లో బీసీ బిడ్డలు తమ సత్తా చాటారు. మరీ ముఖ్యంగా జ్యతిరావు పూలే గురుకులాల్లో… పది ఫలితాలు పరిమళించాయి. ఎంజేపీ బీసీ గురుకులాల స్యూళ్లు మెరిసిపోయాయి. టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులాలు 96.02 శాతం ఉత్తీర్ణతతో స్టేట్ సెకండ్ ప్లేస్ లో నిలిచాయి. ఇక 596, 593 మార్కులతో నెరవాడ ఎంజేపీ స్కూల్ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు.

10th Results : 30 గురుకులాల్లో నూరుశాతం

10th Results

100 స్కూళ్లకు గానూ 30 స్కూళ్లలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల సంఖ్యాపరంగా ప్రభుత్వ పరిధిలోని గురుకులాల్లో ఎంజేపీదే టాప్ ప్లేస్ లో నిలిచింది. ఎంజేపీ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై మంత్రి సవిత హర్షం చేశారు. విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి మంత్రి సవిత అభినందనలు తెలిపారు. బీసీ బిడ్డల విద్యోన్నతికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే ఈ అత్యుత్తమ ఫలితాలని, సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు బీసీ బిడ్డలు, తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు : మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు.

10th Results : టాప్ ప్లేస్ ఎంజేపీదే…

10th Results

గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం ప్రకారం 96.02 శాతంతో ద్వితీయ స్జానంలో ఎంజేపీ గురుకుల విద్యార్థులు నిలిచారు. స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఎంజేపీ విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. వంద బీసీ గురుకులాలకు చెందిన 5,501 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 96.02 శాతంతో 5,274 మంది మేర ఉత్తీర్ణత సాధించారు. ఎంజేపీ కంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల కు చెందిన విద్యార్థులు 96.04 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ఎంజేపీ కంటే 0.02 శాతంతో ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులు ముందంజలో నిలిచారు. టెన్త్ పరీక్షలకు 50 ఏపీ రెసిడెన్షియల్ కు చెందిన విద్యార్థులు 3,135 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఆ లెక్కన చూస్తే, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ విద్యార్థులే టాప్ లో నిలిచినట్లు.

10th Results : గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత

10th Results

గతేడాది కంటే ఎంజేపీ స్కూళ్లలో టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 95 శాతం మేర ఎంజేపీ విద్యార్థులు ఫలితాలు సాధించారు. ఈ ఏడాది 96.02 శాతంతో ఎంజేపీ విద్యార్థులు సత్తాచాటారు. గతేడాది కంటే 1.02 శాతం మేర ఫలితాలు అధికంగా రావడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో 5,355 మంది పరీక్షలు రాయగా, ఈ ఏడాది 5,501 మంది పదో తరగతిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు వంద ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాయగా, 32 గురుకులాలకు చెందిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో పాసయ్యారు. ఎంజేపీ గురుకులాల్లో నంద్యాల జిల్లా నరవాడకు చెందిన విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఆ పాఠశాలకు చెందిన శ్రీసాయి 596 మార్కులతో ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచారు. రీటా సాహితి 593 మార్కులు, యశస్విని 589 మార్కులు సాధించి రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

10th Results : మొన్న ఇంటర్ లో… నేడు టెన్త్ లో…

10th Results

ఈ నెల 15న విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ ఎంజేపీ విద్యార్థులు సత్తా చాటిన విషయం విదితమే. జూనియర్ ఇంటర్ లో 97 శాతంతో, సీనియర్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. నేడు విడుదలైన టెన్త్ పరీక్షల్లోనూ 96.02 శాతం బీసీ బిడ్డలు ఉత్తీర్ణత సాధించి శభాష్ అనిపించుకున్నారు. టెన్త్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 85.25 శాతం కాగా, ఎంజేపీ ఉత్తీర్ణతా శాతం 96.02 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే 10 శాతానికి పైగా సాధించడం విశేషం. జూనియర్ ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 77 శాతం రాగా, ఎంజేపీలో 97 శాతంతో, సీనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి ఫలితాలు 81 శాతం రాగా, ఎంజేపీ విద్యార్థులు 94 శాతంతో సత్తా చాటారు. ప్రభుత్వ పరిధిలో నడిచే అన్ని విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాలు జూనియర్ ఇంటర్ లో ప్రథమ స్థానంలో, సీనియర్ ఇంటర్ లో రెండో స్థానం నిలవడం గుర్తించుకోదగ్గ విషయం.

10th Results : బీసీ హాస్టళ్లలోనూ అదే జోరు…

10th Results

ఎంజేపీ గురుకులాలతో పాటు బీసీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులూ పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల నుంచి 8,466 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా, 7,280 మంది ఉత్తీర్ణత సాధించారు. 85.99 శాతం మేర బీసీ హాస్టళ్ల విద్యార్థులు ప్రతిభ చాటారు. వారిలో 5,187 మంది ఫస్ట్ క్లాస్ లో, 1,437 మంది సెకండ్ క్లాస్, 652 మంది థర్డ్ క్లాస్ లో ఉత్తీర్ణులయ్యారు. 1,001 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారు. బీసీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు గతేడాది 77.22 శాతంతో ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది 8.78 శాతం అధికంగా 85.99 శాతంతో పాసవ్వడం విశేషం. అనకాపల్లి జిల్లా రావికమతం జెడ్పీ హై స్కూల్ విద్యనభ్యసిస్తున్న బీసీ హాస్టల్ విద్యార్థిని కె.మానస మ్యాథ్స్ లో వందకు వంద మార్కులు సాధించడం విశేషం.

10th Results : అమరావతిలో సంబరాలు

10th Results

టెన్త్ పరీక్షల్లో ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 96.02 శాతంతో ఉత్తీర్ణత సాధించడంపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితను ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఎంజేపీ స్కూళ్ల కార్యదర్శి మాధవీలత మర్యాదపూర్వకంగా కలిశారు. గతేడాది కంటే అత్యధిక ఫలితాలు సాధించినందుకు కార్యదర్శి సత్యనారాయణకు, మాధవీలతకు స్వీట్లు అందజేసి, మంత్రి అభినందించారు.

ALSO READ : Ayush College Vijayawada : ఆయుష్ ప్రొఫెస‌ర్ స‌స్పెనన్ష‌న్ ? Andhra Prabha News

Leave a Reply