Ayush College Vijayawada : ఆయుష్ ప్రొఫెసర్ సస్పెనన్షన్ ? Andhra Prabha News
Ayush College Vijayawada : ఆయుష్ ప్రొఫెసర్ సస్పెనన్షన్ ? Andhra Prabha News
- లైంగిక వేధింపుల కేసు కీలక మలుపు
- ప్రొఫెసర్, టెక్నీషియన్ పై వేటు ఖాయం ? ..
- ప్రిన్సిపాల్‌పై నిర్లక్ష్య ఆరోపణలు
- పరీక్షల విధులకు దూరం ..
- మహిళా కమిషన్ సిఫార్సు
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
Ayush College Vijayawada : విజయవాడ లోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు కీలక మలుపు తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ దేవత్ మౌళినాయక్, ల్యాబ్ టెక్నీషియన్ కేవీ సుబ్రహ్మణ్యంలను సస్పెండ్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
విద్యార్థినుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆయుష్ కమిషన్‌కు నివేదిక పంపించారు. అదే సమయంలో, విద్యార్థినుల ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాల ప్రిన్సిపాల్‌ను పరీక్షల సమయంలో విధులకు దూరంగా ఉంచాలని కూడా సూచించారు.
ఈ కేసు ప్రారంభం ఈ నెల 17న విద్యార్థిని మహిళా కమిషన్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో జరిగింది. అనంతరం 22న రాయపాటి శైలజ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. మహిళా కమిషన్‌కు సమర్పించిన నివేదిక ఇప్పటికే ఆయుష్ కమిషన్‌కు చేరిన నేపథ్యంలో, ప్రొఫెసర్, ల్యాబ్ టెక్నీషియన్‌పై ఈ రోజు సాయంత్రం లోపు సస్పెన్షన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కళాశాలలో భద్రతా ప్రమాణాలు, ఫిర్యాదు వ్యవస్థల పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
