38months | డిన్నర్.. విత్ విన్నర్స్..

38months | డిన్నర్.. విత్ విన్నర్స్..
మంత్రులకు, వివిధ శాఖల అధిపతులకు చంద్రబాబు విందు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో సీఎం ఫీస్
నేటి రాత్రి సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాట్లు
38months | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులు, ప్రభుత్వంలోని పలు శాఖల కార్యదర్శలు, వివిధ విభాగాల అధిపతుల(హెచ్‌ఓడీ)కు ఆయన విందు ఇవ్వనున్నారు. సీఆర్డీఏ కార్యాలయంలో వీరందరికి గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. తనకు వచ్చిన ఈ అవార్డు రాష్ట్రానికి, ప్రభుత్వానికి వచ్చిన గుర్తింపు అని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందరి సహకారం, భాగస్వామ్యంతో ఈ అవార్డు వచ్చిందని వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులను మోటివేట్ చేసేందుకు, వారి సహకారానికి ధన్యవాదాలు తెలిపేందుకు వారిని ఈ డిన్నర్‌కు ఏపీ సీఎం ఆహ్వానించారు. డిన్నర్ విత్ విన్నర్స్ పేరుతో మంత్రులు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు ఇప్పటికే సీఎం చంద్రబాబు పేరుతో ఆహ్వానాలు వెళ్లాయి.

38months | రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ..
రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో అధికారం చేపట్టిన ఈ 22 నెలల్లో సాధించిన విజయాలు.. రానున్న 38 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలపై అధికారులతో చర్చించి ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తనకు వచ్చిన అవార్డు రాష్ట్రానికి మరిన్నిపెట్టుబడులు తీసుకు రావడానికి, బ్రాండ్ క్రియేట్ చేయడానికి దోహద పడాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలక భాగస్వాములను ఆహ్వానించి కార్యోన్ముఖులను చేసేందుకు ఈ విందు సమావేశాన్ని సీఎం ఏర్పాటు చేశారు.
CLICK HERE TO READ MORE : Withdraw | మంగ్లీ సోదరుడి ఖాతా లావాదేవీలపై పోలీసుల దృష్టి
