YSRCP | ఘనంగా16వ ఆవిర్భావ వేడుకలు…

YSRCP | ఘనంగా 16వ ఆవిర్భావ వేడుకలు…

  • ఎగిరిన పార్టీ జెండా.. మార్మోగిన ‘జై జగన్‌’ నినాదాలు
  • కేక్ కట్ చేసి ఆత్మీయంగా సంబరాలు జరుపుకున్న శ్రేణులు
  • హాజరైన మండల కన్వీనర్ చలపతి రాజు, విశేష సంఖ్యలో కార్యకర్తలు

YSRCP | పిచ్చాటూరు, ఆంధ్ర‌ప్ర‌భ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే ఊపిరిగా, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకమే ఆయుధంగా ఆవిర్భవించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిచ్చాటూరు మండల కేంద్రంలోగురువారంఅంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, అభిమానులు పండుగ వాతావరణంలో ఈ సంబరాలను ఘనంగా నిర్వహించారు.మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కె.వి. చలపతి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను సగర్వంగా ఆవిష్కరించారు.

అనంతరం భారీ కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుని ఒకరికొకరు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మహానేత రాజన్నను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని నాయకులు కొనియాడారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల కోసమే పనిచేస్తూ, సంక్షేమ పథకాల అమలులో వైఎస్సార్‌సీపీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందన్నారు. భవిష్యత్తులోనూ జగనన్నకు అండగా నిలుస్తూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రమేష్ రాజు, రామచంద్ర రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తోపయ్య, సూరిబాబు రెడ్డి, చెంగల్ రాయల్ రెడ్డి, రమేష్, చంద్ర శేఖర్, వెంకటేష్, చంద్రయ్య, గోవిందస్వామి, కారణమూర్తి, యేసు, నాగరాజు, శరత్ రాఘవ రెడ్డి తదితరులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

CLICK HERE TO READ MORE :