youth power | దేశానికి భవిత
youth power | దేశానికి భవిత
youth power | ఏ దేశానికైనా నైపుణ్యాలతో కూడిన యువత ప్రధాన బలం. ప్రపంచంలో అత్యధిక యువజనాభా గల దేశం మనదే. ప్రపంచ యువ జనాభా 180 కోట్లుగా ఉంటే.. 28 శాతం వాటా మనదే. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా, ఏ ప్రాజెక్టు పట్టాలెక్కాలన్నా.. యువత క్రియాశీల భాగస్వామ్యం అవ సరం. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా యువ తలో పెరుగుతోన్న అసంతృప్తి అంశం మీద సర్వే చేసిన ఒక అంతర్జాతీయ మీడి యా సంస్థ తన నివేదికను వెల్లడించింది. ‘రాబోయే రోజుల్లో వచ్చే తిరుగుబాట్లలో చురుగ్గా పాల్గొంటారా? అనే ప్రశ్నను 35 దేశాల్లోని 18-34 ఏళ్ల మధ్య వయసున్న 5.8 లక్షలమందిని అడగగా వారిలో సగానికి పైగా అవుననటం ప్రపంచ యువత అసంతృప్తికి నిదర్శనం. అందరికీ మెరుగైన విద్య, ఉపాధి, సమాజంలో సమాన అవకాశాలు లేకపోవటమే ఈ దుస్థితికి కారణమని ఆ నివేదిక వాపోయింది. యువశక్తి దేశాభ్యుద యానికి జీవనాడి. ఆ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.
youth power | 33 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.

మనదేశంలో 15-29 ఏళ్ల మధ్య వయస్కులను యువత గా పరిగణిస్తున్నాం. స్థూల దేశీ యోత్పత్తిలో వీరి వాటా 34 శాతం. మరో ఇరవయ్యేళ్లు, యువ జనాభాపరంగా భారతన్ను మరే దేశమూ అందుకోలేదు. పనిచేయగల వయసులో ఉన్న యువత ఉండటం సంతోషానికి కారణమైతే మనదేశంలోని యువతకు తగిన నైపుణ్యాలు లేవనే వాస్తవం బాధ పెడుతోంది. దేశంలో డిగ్రీ చదివిన వారిలో 35.2 శాతం, పీజీ పట్టా పుచ్చు కున్నవారిలో 36.2 శాతం, సంప్రదాయ వృత్తి విద్యా కోర్సు లను అభ్యసించినవారిలో 33 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. లేదా తమ చదువుకు తగని చిన్నాచితకా కొలువులతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.
youth power | దేశం ముందున్న అతిపెద్ద సవాలు
ఇక పురుషులతో పోల్చితే యువతుల్లో చాలా ఎక్కువగా ఉంది. దేశ జనాభాలో 48 శాతం వాటా మహిళలదే అయినా కార్మిక శక్తిలో వారి భాగస్వామ్యం 20 శాతమే. ఏటా దాదాపు 1.1 కోట్ల దేశీయ యువత కొత్తగా ఉద్యోగాల వెతుకులాట మొదలుపెడుతుండగా, వారిలో సగం మంది తగిన నైపుణ్యాలు లేనేలేవు. మరో వైపు.. తమ సంస్థలలో పనిచేయటానికి మెరుగైన మానవ వనరులు దొరకటం లేదంటూ ప్రము ఖ సంస్థలు వాపోతున్నా యి. ఈ అగాధాన్ని పూడ్చడమే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాలు.
మన కార్మిక శక్తిలో 92 శాతానికిపైగా అసంఘటిత రంగంలో ఉండగా, 8 శాతం మంది మాత్రమే సంఘటిత రంగంలో సేవలందిస్తున్నారు. ఈ రెండు వ్యవస్థల అవసరాలు పూర్తిగా భిన్నమైనవే అయినా, యువతకు నైపుణ్యాలను అందించి, వారిని నిలకడగల ఉపాధి బాట పట్టించటం అవ సరం. మనదేశంలో బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీలలో యువ జనాభా తగ్గుతుండగా, రాజస్థాన్, బీహార్….
