YCP | వేలేరు వైసీపీ అధ్యక్షుడుగా..

YCP| వేలేరు వైసీపీ అధ్యక్షుడుగా..

YCP, హనుమాన్, ఆంధ్రప్రభ : బాపులపాడు మండలం వేలేరు గ్రామ వైయస్సార్ (YSR) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దోనవల్లి భార్గవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వేలేరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా దోనవల్లి భార్గవ్ ను నియమించాలని నాయకులు, కార్యకర్తలు తెలపటంతో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా దోనవల్లి భార్గవ్ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, గన్నవరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీకి, మండల వైసీపీ అధ్యక్షుడు నక్క గాంధీకి, కన్వీనర్ ఆవిర్ననేని శేషగిరిరావుకి, ఎంపీపీ యరగొర్ల నగేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి చిన్న వయసులో ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసి రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YCP) పార్టీని విజయ వైపు నడిపిస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరినే కలుపుకుంటూ వెళ్తాను. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా గ్రామ ప్రజలందరికీ ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు.