సామాజిక సేవలకు గౌరవ డాక్టరేట్‌..

సామాజిక సేవలకు గౌరవ డాక్టరేట్‌..

డాక్టర్ కొత్తపల్లి రాజేశ్వర్‌కు అరుదైన గౌరవం

జాతీయ పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం.. నిర్మల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దబెల్లాల్ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు డాక్టర్ కొత్తపల్లి రాజేశ్వర్‌కు గౌరవ డాక్టరేట్ లభించడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. సామాజిక సేవ, విద్యా రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ అరుదైన గౌరవాన్ని ప్రదానం చేశారు.

మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొత్తపల్లి రాజేశ్వర్‌కు జాతీయ పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్‌ను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు.

సామాజిక సేవా రంగంలో గత 16 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాజిక చైతన్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, ప్రజలకు సేవలందించడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ యువత అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, పేదలకు సహాయ సహకారాలు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించిన నిర్వాహకులు ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టు మిత్రులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు డాక్టర్ కొత్తపల్లి రాజేశ్వర్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా సామాజిక సేవా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ గౌరవం నిర్మల్ జిల్లాకు, ముఖ్యంగా కడెం మండలానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

Leave a Reply