రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడెం మండల కేంద్రానికి చెందిన జాలిగాం వినయ్ కుమార్ (24) అనే యువకుడు మృతి చెందాడు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వినయ్ కుమార్ ద్విచక్ర వాహనంపై కడెం నుంచి కొండుకూరు గ్రామం వైపు వెళ్తుండగా కన్నాపూర్ సమీపంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వినయ్ కుమార్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
