నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్న ముఠా ను పట్టుకున్నట్లు చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ తెలిపారు. సోమవారం తమ పోలీసు సిబ్బందికి స్థానిక బస్టాండ్ లో పట్టుకున్నారని, ఈ విషయం స్థానిక వ్యవసాయ శాఖ ఏఓ కు తెలియజేసి విచారణ చేసి వారి వద్దనుంచి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Leave a Reply