Mystery Death Karimnagar | హత్యా.. ఆత్మహత్యా

Mystery Death Karimnagar | హత్యా.. ఆత్మహత్యా

మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తింపు
కరీంనగర్ వావిలాలపల్లిలో ఘటన

Mystery Death Karimnagar | కరీంనగర్ క్రైమ్ ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా కేంద్రం లోని వావిలాలపల్లి లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. గత కొన్ని లుగా వావిలాలపల్లిలో నివాసముంటున్న సుధా (51) మృతి చెందిన సంఘటన నగరం లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల తనకు తానుగా గొడ్డలితో తలపై బాదుకొని మృతి చెందిందనీ. బంధువులు తెలియజేస్తున్న మృతదేహం అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు హత్య కోణంలో సైతం దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలు సుధ కు 25 ఏళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తర్వాత నెల రోజుల్లోనే భర్తతో విభేదాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నట్లు బంధువులు తెలిపారు. రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు, అయితే మృతురాలు చిన్నప్పటి నుండే మతిస్థిమితం సబంధించి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు రెండు రోజుల క్రితం చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వచ్చిందని తెలిపారు. ఇంట్లో గ్యాస్ స్టవ్ కు సంబంధించిన చిమ్ని. ఫోన్ కూడా పగలగొట్టినట్లు సమాచారం. శుక్రవారం తండ్రి చూస్తుండగానే గొడ్డలితో తలపై మోదుకొని గాయపరచుకున్నట్లు తెలిపారు. తలపై తీవ్ర గాయాల పాలైన సుధా అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు.