Palwancha Suspicious Death | మూడు రోజుల తర్వాత వెలుగులోకి ఘటన

Palwancha Suspicious Death | మూడు రోజుల తర్వాత వెలుగులోకి ఘటన
Palwancha Suspicious Death | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పాల్వంచ పట్టణానికి చెందిన కేటీపీఎస్ ఉద్యోగి మీసాల సునీల్ కుమార్ (45) తన నివాసంలో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల కథనం ప్రకారం… సునీల్ కుమార్ గత మూడు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇదే సమయంలో ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి పరిశీలించారు.
ఇంట్లోని బెడ్‌రూమ్‌లో సునీల్ కుమార్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని టౌన్ ఎస్సై టి.నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
