కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భగీరథ లొంగిపోయాడు కదా.. ఇంక ఇష్యూ ఏముందని ఆయన అన్నారు. ఈ కేసు విచారణ జరుగుతుందని, పోక్సో కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
