ట్రాక్టర్‌పై నుంచి పడి కార్మికుడు మృతి

ట్రాక్టర్‌పై నుంచి పడి కార్మికుడు మృతి
బీర్‌పూర్, ఆంధ్రప్రభ:
సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామంలో ఇటుక బట్టికి చెందిన ట్రాక్టర్‌పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫకీర నాగ్‌గా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఫకీర నాగ్ ఆదివారం సాయంత్రం రేచపల్లి గ్రామంలో ఇటుక బట్టికి చెందిన ట్రాక్టర్‌పై ఎక్కి పోతారం వైపు వెళ్తున్నాడు. ట్రాక్టర్‌ను తారకరామ నగర్‌కు చెందిన గండికోట నరేష్ నడుపుతున్నాడు.
ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో మధ్యలో నిల్చున్న ఫకీర నాగ్ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయం అయింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి రమే నాగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సారంగాపూర్ ఎస్సై పి. గీత తెలిపారు.
