ఘనంగా మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలు

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని చీలాపూర్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలను లింగ బలిజల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగ బలిజల సంఘం అధ్యక్షుడు పవ్వాడి శేఖర్, మండల అధ్యక్షుడు పవ్వాడి మల్లికార్జున్, ఉపాధ్యక్షుడు నందయ్య (బేగంపేట) పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఆయన బోధనలు, సమానత్వ సందేశాన్ని గుర్తుచేసుకుంటూ నాయకులు ప్రసంగించారు. సమాజంలో ఐక్యత, సౌహార్దం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పవ్వాడి నందయ్య, పవ్వాడి నాగయ్య, టేకుమళ్ళ రాజేశం, జలిగం సత్తయ్య, పవ్వాడి నాగరాజు, పవ్వాడి రమేష్, పవ్వాడి ఉమేష్, శీలం లింగమూర్తి, శీలం ఉమాశంకర్, శీలం భద్రయ్య, జలిగం కుమారస్వామి, సొల్లేటి శంకర్, చిట్యాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.