ప్రైవేట్ బడి వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు
- పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కానిస్టేబుల్ రవి
తాడ్వాయి, ఆంధ్రప్రభ: కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఓ పోలీస్ కానిస్టేబుల్ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బక్కోళ్ల రవి కానిస్టేబుల్ తన కుమారుడిని పృత్విక్ ను ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా,కృష్ణాజివాడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ రామస్వామి ఆధ్వర్యంలో మూడవ తరగతి లో చేర్పించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగిందని అన్నారు.
మండల విద్యాశాఖ అధికారి రామస్వామి మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యార్వతలు గల ఉపాధ్యాయ బృందం చే నాణ్యమైన విద్యా బోధన అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని తల్లిదండ్రులు వారి పిల్లలను కానిస్టేబుల్ రవి బాటలోని నడిచి ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యను పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రవి ని ప్రత్యేకంగా ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగు బాయి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
