ఎడపల్లిలో విషాదం..
ఎడపల్లిలో విషాదం..
కుటుంబ వివాదాల నేపథ్యంలో మహిళ మృతి
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో ఉన్న అశోక్‌సాగర్ చెరువు వద్ద ఓ మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్‌కు చెందిన మొట్టాడి నాగలక్ష్మి అలియాస్ శారద (55), భర్త కీ.శే. పోలయ్య. కుటుంబ సంబంధాల విషయంలో కొంతకాలంగా ఆమె మనస్తాపంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇటీవల ఇంటికి వచ్చిన బంధువులతో వివాదం జరిగిన తర్వాత వారు ఇకపై ఇంటికి రామని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి మానసికంగా కృంగిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాగలక్ష్మి, జానకంపేట్ శివారులోని అశోక్‌సాగర్ చెరువు వద్ద మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మృతురాలి కుమారుడు మొట్టాడి శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ తెలిపారు.
