ఘనంగా శివాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లాలోని మండలం వేల్పూర్ శివారులో అమీనాపూర్ గ్రామం వద్ద ఉన్న సాయిబాబా దేవాలయం ప్రాంగణంలోని శివాలయంలో గురువారం ఆలయ అర్చకులు బోనగిరి గంగాధర్ ఆధ్వర్యంలో కుటుంబంలో శాంతి, సంపద, సంతోషాన్ని ఇచ్చే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్ని వేల్పూర్ కు చెందిన గజ్జెల నవ్య భాస్కర్ దంపతులు, భీంగల్ కు చెందిన కలిగోట వనిత నర్సింగ్ దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్ని ఆచరించి అన్నదానం చేశారు. గోమాత పూజ, అన్న పూజలో అన్నదాతలు భాగస్వాములు అయ్యారు. తదనంతరం ధ్యాన మందిరంలో భజన కళాకారులు మృదు మధుర గానాలతో సామూహిక భజనలు చేశారు.
పల్లకి సేవను సాయి భక్తులు, భజన కళాకారులు, ఆలయ కమిటీ సభ్యుల సంపూర్ణ సహకారంతో ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ కు చెందిన లక్ష్మీ రాజేశ్వర్ దంపతులు, చేపూర్ కు చెందిన బేగరి భాగ్యలక్ష్మి సంతోష్ దంపతులు, వేల్పూర్ కు చెందిన గజ్జెల నవ్య భాస్కర్ దంపతులు, భీంగల్ కు చెందిన కలిగోట వనిత నర్సింగ్ దంపతులు అన్నదానం చేశారు. అన్నదాతలను ఆలయ అర్చకుడు అనురాగ్ పాండే శాలువాతో సన్మానించి గోవిందగిరి స్వామి చిత్రపటాన్ని ఇచ్చి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు.ఇట్టి మహత్కార్యంలో సాయిబాబా ఆలయ అర్చకుడు అనురాగ్ పాండే, ఆలయ కమిటీ సభ్యులు, సాయి సేవకులు, తదితరులు పాల్గొన్నారు.
