బావిలో దూకి మహిళ ఆత్మహత్య..
రేగొండ, ఆంధ్రప్రభ : బావిలో పడి మహిళా మృతి చెందిన సంఘటన రేగొండ మండలం రేపాక గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బండి ఓదమ్మ (67)పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి గత ఎనిమిది నెలల నుండి అనారోగ్య సమస్యలతో పాటు ,కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి సమయంలో ఇంట్లో అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత ఓదెమ్మ ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లు తెలిపారు.
గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓదెమ్మ కోసం బంధువుల ఇండ్లు, గ్రామంలో గాలింపు చేస్తున్న క్రమంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి శవమై కనిపించినట్లు తెలిపారు. మృతురాలి కొడుకు బండి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై. సుధాకర్ తెలిపారు.
