మాజీ మంత్రిని కలిసిన నాగేందర్ గౌడ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పట్టభద్రుల ఎన్నికలతో పాటు పలు రాజకీయ అంశాలపై ఇద్దరూ చర్చించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని నాగేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డిని కోరినట్లు సమాచారం.
