Emails | స్కూళ్లలో తనిఖీలు…

Emails | స్కూళ్లలో తనిఖీలు…

Emails | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గురుగ్రామ్‌లో ఇవాళ అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే స్కూళ్ల యాజమాన్యాలు అత్యవసర ప్రోటోకాల్ అమలు చేసి విద్యార్థుల భద్రత కోసం తక్షణ చర్యలు చేపట్టాయి.

బెదిరింపు మెయిల్స్ రావడంతో అనేక స్కూళ్లు సెలవు ప్రకటించాయి. విద్యార్థులను వెంటనే తీసుకెళ్లాలని పేరెంట్స్‌కు సందేశాలు పంపాయి. దీంతో స్కూళ్ల వద్దకు భారీ సంఖ్యలో తల్లిదండ్రులు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

శ్రీరామ్, ఆమిటీ, హెచ్‌డీఎఫ్ స్కూళ్లకు ఉదయం 8.33 గంటలకు ఈమెయిల్స్ వచ్చినట్లు సమాచారం. అప్పటికే విద్యార్థులు స్కూళ్లకు రావడం ప్రారంభమైంది. దీంతో అధికారులు అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించారు.

బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్ల వద్దకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. సుమారు 10 స్కూళ్లు ఈ విషయమై పోలీసులను ఆశ్రయించాయని, అన్ని విద్యాసంస్థల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగుతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Leave a Reply