పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం…

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు బాలింతలు కిశోర బాలికలు పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండవచ్చని మల్లెపల్లి సర్పంచ్ కథలప్ప అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గర్భిణీలు బాలింతలు కిశోర బాలికల సంపూర్ణ ఆరోగ్యవంతనికి అంగన్వాడి కేంద్రాల ద్వారా అందజేస్తున్న బలవర్ధకమైన ఆహారం ప్రతిరోజు పాలు పండ్లు గుడ్లు , మాంసం పప్పు దినుసులు ఆకుకూరలు వంటి సమతుల్య ఆహారం తీసుకోవాలనిఅన్నారు.

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అక్షర జ్ఞానంతో పాటు ఆటపాటలు నేర్పించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహారం తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు సకాలంలో పౌష్టికాహారం పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి రామేశ్వరీ రేణుక, ఆశా వర్కర్లు రాధా సుస్మిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply