వింజమూరికి ‘ నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ పురస్కారం’

వింజమూరికి ‘ నేషనల్ బెస్ట్ సోషల్ సర్వీస్ పురస్కారం’

తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు పట్టణానికి చెందిన వింజమూరి సుధాకర్ వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా చైర్మన్ గా వ్యవహరిస్తూ వినియోగదారులకు అండగా నిలవడంతో ఆయన సేవలను గుర్తించిన హైదరాబాద్ కు చెందిన కళావేదిక సంస్థ ‘బెస్ట్ సోషల్ సర్వీస్’ పురస్కారానికి వింజమూరిని ఎంపిక చేసింది. తాజాగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో కళావేదిక సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

కళాకారులు, సినీ తారలు, సామాజిక, సేవ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకల్లో మాజీ కేంద్రమంత్రి టి. సుబ్బిరామిరెడ్డి వింజమూరి సుధాకర్ కు పురస్కారాన్ని ప్రధానం చేశారు.సభికుల హర్షద్వానాల మధ్య ఘనంగా సత్కరించారు.

దక్షిణాది నుంచి అవార్డులకు ఎంపిక చేసిన పదిమందిలో వింజమూరి ఒకరు. ఆయన గతంలో నేషనల్ బెస్ట్ యూత్ అవార్డు, మదర్ థెరీసా పురస్కారం, బెస్ట్ కన్జ్యూమర్ అవార్డు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫోరం సర్వీస్ అవార్డులను అందుకున్నారు.డీసీఐసీ జిల్లా చైర్మన్ వ్యవహరించడంతో పాటు బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (బోప్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ… తాను చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక కళావేదిక సంస్థ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందించడం గర్వకారణంగా భావిస్తున్నానన్నారు.ఈ పురస్కారం తన బాధ్యతను పెంచిందని, మరింత ఉత్సాహంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని స్పష్టం చేశారు. పురస్కారం పొందేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply