Warning | పార్టీ లైన్ దాటొద్దు – స్వ‌పార్టీ నేత‌ల‌కు జ‌న‌సేన వార్నింగ్

మంగ‌ళ‌గిరి – పార్టీ లైన్ దాటవద్దు అంటూ త‌న పార్టీ నేత‌లకు జ‌న‌సేన హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.. ఈ మేర‌కు త‌న అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక లేఖ పోస్ట్ చేసింది . కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి. హరిప్రసాద్ పేరుతో విడుదలైంది.

“జనసేన పాలసీపైనా, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలలో ఎప్పటి కప్పుడు తెలియజేస్తునే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీలైన్‌ను విస్మరించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇటు ప్రజలలోను, అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడే వారు కఠిన చర్యలకు గురి కావలి ఉంటుందని తెలియజేస్తున్నాం.” అని జనసేన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply