Telangana | కుటుంబ విభేదాలే కారణమా?

Telangana | కుటుంబ విభేదాలే కారణమా?

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో డాక్టర్ జోసఫ్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జోసఫ్‌కు 18 ఏళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇటీవల డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. జోసఫ్ ఆత్మహత్యకు భార్య వేధింపులే కారణమని ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply