Constitution Day | రాజ్యాంగ దినోత్సవం..

Constitution Day | రాజ్యాంగ దినోత్సవం..
Constitution Day, ఉయ్యూరు, ఆంధ్రప్రభ : రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) వేడుకలు రెవెన్యూ డివిజినల్ అధికారిణి బి.యస్.హెలా షారోన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం విశిష్టతను తెలుపుతూ రెవెన్యూ డివిజినల్ అధికారిణి, డివిజన్ లోని ఉద్యోగులు అందరూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ పరిపాలనా అధికారి కె. రాజకుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
