ముగ్గురికి కీలక బాధ్యతలు.. సంఘంలో హర్షం

ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ: ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తుమోజు సురేష్ చారి, చిలుకూరి రాధాకృష్ణ చారి, శ్రీరామోజు భాస్కర్ చారిలను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుమోజు సురేష్ చారి, చిలుకూరి రాధాకృష్ణ చారి, శ్రీరామోజు భాస్కర్ చారి ఎన్నో సంవత్సరాలుగా సంఘ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఆపదలో ఉన్న అనేక మందికి సహాయ సహకారాలు అందించి మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించే సామర్థ్యం ఉన్నందున వారికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కొత్త బాధ్యతలతో సంఘ అభివృద్ధికి, విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

నూతనంగా ఎంపికైన నాయకులకు పలువురు సంఘ ప్రతినిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశ్విని కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ సుభాష్ చంద్రబోస్, జాతీయ వ్యవహారాల అధ్యక్షులు బ్రహ్మశ్రీ రామ్‌రాజ్, జాతీయ యువజన విభాగం అధ్యక్షులు బ్రహ్మశ్రీ దిలీప్ కుమార్ శర్మ, జాతీయ అడ్వైజరీ కమిటీ సభ్యులు బ్రహ్మశ్రీ చిన్మయ చారి తదితరులు అభినందనలు తెలిపారు.

Leave a Reply