అక్షయ తృతీయ అక్షరాభ్యాస సందడి
అక్షయ తృతీయ అక్షరాభ్యాస సందడి
బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో సోమవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రల నుండి కాక మహారాష్ట్ర నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరి నది తీరాన గల శివాలయంలో ప్రత్యేక అభిషేక అర్చన పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులు చిన్నారులు అమ్మవారి అక్షరాభ్యాస దర్శన క్యూ లైన్ లో బారులు తీరారు. అక్షయ తృతీయ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెంత ఆలయ అర్చకులచే భక్తుల తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులు చిన్నారులు ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అక్షరాభ్యాసానికి ఒక్కో బ్యాచుకు గంటకు పైగా సమయం పట్టింది.
సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాసాలు 720 వరకు జరిగాయని అధికారులు తెలిపారు. క్యూలైన్లో అక్షరాభ్యాస పూజలో వేచి ఉన్న భక్తులకు దాతల తరఫున త్రాగునీరు, కోకోనట్ వాటర్ అందించారు. అమ్మవారి అన్నదాన సత్రంలో భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్జిత సేవలు ప్రసాదాల అమ్మకాలు అక్షరాభ్యాస పూజల ద్వారా 15 లక్షల వరకు ఆలయానికి ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు సుమారు పదివేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అధికారులు పేర్కొన్నారు.

