వరి కొయ్యలకు మంటలు..

వరి కొయ్యలకు మంటలు..

  • మంటలకు వృద్ధుడు సజీవ దహనం..

జన్నారం, ఆంధ్రప్రభ : వరి కొయ్యలకు అంటిన మంటలను ఆర్పేందుకు వెళ్లిన 70ఏళ్ల వృద్ధుడు ఆ మంటలు అంటుకొని సజీవ దహనమైన విషాదకర సంఘటన ఇది. గ్రామస్తుల,పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన రేగుంట పోచం(70) వరి కొయ్యల మంటలను ఆర్పేందుకు వెళ్లి మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని సజీవ దహనమయ్యారు.

అతని వరి పొలం పక్కనే ఉన్న ఓ రైతు కోసిన వరి కొయ్యలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.ఆ నిప్పు అతని వరి పొలంలోని కొయ్యలకు అంటుకొని మంటలు చెలరేగడంతో ఆ మంటలను ఆర్పడానికి వెళ్ళిన పోచం ప్రమాదవశాత్తు ఆ మంటల్లో పడి చనిపోయారు.మృతుని పెద్ద కుమారుని రేగుంట ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ సాయంత్రం తెలిపారు.మృతునికి భార్య దుర్గమ్మ,ఇద్దరు కుమారులు ఉన్నారు.మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.