రామానాయుడు స్టూడియో సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ..
తీవ్ర గాయాలతో కేజీహెచ్‌కు తరలింపు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జక్క లావణ్య అనే మహిళ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం.
మధురవాడ ప్రాంతానికి చెందిన లావణ్య తీవ్ర మానసిక ఒత్తిడి (డిప్రెషన్) కారణంగా ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఘటనలో మహిళకు సుమారు 50 శాతం కాలిన గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్‌లో కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.
