స్టైపెండ్, మౌలిక వసతుల కోసం మెడికల్ విద్యార్థుల ఆందోళన
చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్లలోని మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీలో స్టైపెండ్ చెల్లింపులు, మౌలిక వసతుల లేమిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత పది రోజులుగా తమ సమస్యలను కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు. స్టైపెండ్‌ను వెంటనే చెల్లించాలని, తాగునీరు, హాస్టల్ సౌకర్యాలు, ఇతర కనీస మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
