NEWS@10:00 A.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు

killed-hit-and-run : అదే ఆఖరి నడక Andhra Prabha Crime News

కర్నూలు నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతి చెందారు. నగరంలోని బళ్లారి చౌరస్తా జాతీయ రహదారి వద్ద వాకింగ్ చేస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ వరప్రసాద్ (43)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది.దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఎండుతున్న నారుమళ్లు.. ఎల్నినోతో ఖరీఫ్‌పై కరవు నీడ

ఖరీఫ్ సాగుపై అన్నదాత అయోమయ పరిస్థితిలో పడ్డాడు. ప్రధానంగా ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని జిల్లాల్లో వరి నారు పోసుకున్న రైతులు ఇప్పుడు వర్షాలు కురవకపోవడంతో వరి నారును బిందెలతో తడుపుతూ బతికించుకుంటున్నారు. 

సెటిలర్ల మొగ్గు అటే.. ఏపీలోనే ఓటు కొనసాగించేందుకు ఆసక్తి

ఏపీలో సర్కు ముగుస్తున్న గడువు తెలంగాణ మెడకు చుట్టుకుంటోంది. కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్రోల్‌మెంట్ ప్రక్రియ ముగుస్తుండటంతో దీని ప్రభావం తెలంగాణలోని హైదరాబాద్‌పై తీవ్రంగా పడుతోంది. ఏపీలో ఓటు ఉంచుకోవాలా లేక తెలంగాణలోనా అన్న సందిగ్ధం తీరిపోనుంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతి నగర్, నిజాంపేట, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, బాచుపల్లి, అశోక్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఇప్పుడు తమ ఓటు ఎక్కడ ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

‘ఓటరు సర్’కు సముచిత స్థానం.. ప్రజాస్వామ్యంలో ఓటరే కేంద్రబిందువు

ఓటుకోవటం ఎలా? అని రాజకీయ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తుంటే, ఓటర్ను గుర్తించటం ఎలా? అని ‘సర్’ ఆపసోపాలు పడుతున్నది! ఎలక్షన్ల ముందు డబ్బూ దస్కంతో రాజకీయ నాయకులు ఓటర్ల చుట్టూ తిరుగుతుండటం ఎన్నోసార్లు చూసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారాలతో బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓస్) నిజమైన ఓటరు ఎవరో నమోదు చేసేందుకు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు!

కృతజ్ఞతా భావం.. జీవితాన్ని మార్చే అమృతధార

సృష్టిలో మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ జీవితం ఎన్నో అద్భుతాల సమాహారం. అయితే, నేటి ఆధునిక పరుగుల లెక్కింపులో మనిషి తన వద్ద ‘లేని’ వాటి గురించి ఆలోచిస్తూ, నిరంతరం బాధపడుతూ గడిపేస్తున్నాడే తప్ప… తన వద్ద ‘ఉన్న’ వాటిని చూసి సంతోషించడం పూర్తిగా మరుస్తున్నాడు. ఈ నిరంతర అసంతృప్తిమానసిక ఒత్తిడి నుంచి విముక్తిని ప్రసాదించే ఒకే ఒక్క దివ్యౌషధం ‘కృతజ్ఞతా భావం’.


పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ రెండూ బాధ్యత వహించాల్సిందే

ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి కొద్ది రోజులైనా కాలేదు, మళ్లీ అమెరికన్ సేనలు ఇరాన్‌లోని 140 లక్ష్యాలపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో భారతీయ నావికుడు ఒకరు మరణించారు. కాగా, హార్మూజ్ జలసంధి ఇకపై పూర్తిగా తమ అధీనంలోనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. హార్మూజ్ సమీపంలోని కెష్క్ దీవిపై దాడి జరిగింది. 

Click here to read the full stories