Breaking | గూడ్స్ కింద పడి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండలో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మృతుల వివరాలను గుర్తించడంతో పాటు కుటుంబ నేపథ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.