నర్సాపూర్‌లో తాగునీటి బోర్‌వెల్ పునరుద్ధరణ..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ డీఎస్ సంగీత రాజేష్ అన్నారు. మంగళవారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేయకుండా ఉన్న మంచినీటి బోర్‌వెల్‌ను మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగం రమేష్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
