National Highways | జాతీయ రహదారులపై కీలక చర్చ

National Highways | జాతీయ రహదారులపై కీలక చర్చఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ‌ న్యూఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రహదారి ప్రతిపాదనలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో వివిధ దశల్లో నిలిచిపోయిన జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం.

అలాగే తెలంగాణలో రహదారుల అనుసంధానం మెరుగుపరచడం, జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రహదారి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలను త్వరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.