Vijayawada కనకదుర్గమ్మను దర్శించుకున్న నగర పోలీస్ కమిషనర్ దంపతులు
Vijayawada కనకదుర్గమ్మను దర్శించుకున్న నగర పోలీస్ కమిషనర్ దంపతులు
ఇంద్రకీలాద్రి (Vijayawada), ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కమిషనర్ దంపతులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేసి దంపతులకు అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె. శీనా నాయక్ కమిషనర్ దంపతులకు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
