Kurnool 19 మంది ఆర్‌ఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి
Kurnool 19 మంది ఆర్‌ఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి
కర్నూలు బ్యూరో( Kurnool), ఆంధ్రప్రభ: ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఆర్‌ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల కన్వర్షన్ ద్వారా సివిల్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన 19 మంది అధికారులు శుక్రవారం కర్నూలులోని రేంజ్ డీఐజీ కార్యాలయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ పదోన్నతి పొందిన అధికారులకు అభినందనలు తెలిపారు. పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొంటూ, ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచేలా క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. శాఖ ప్రతిష్ఠను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల 2009, 2012, 2015, 2018 బ్యాచ్‌లకు చెందిన 19 మంది ఆర్‌ఎస్‌ఐలు ఎస్‌ఐలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారు డీఐజీకి కృతజ్ఞతలు తెలిపారు.
