దివ్యాంగుల చిన్నారుల పాఠశాల నమోదు కార్యక్రమం నిర్వహణ..
దివ్యాంగుల చిన్నారుల పాఠశాల నమోదు కార్యక్రమం నిర్వహణ..
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : సిడబ్ల్యూఎస్ఎన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా విస్సన్నపేట గ్రామంలో మంగళవారం దివ్యాంగ విద్యార్థులను గుర్తించి పాఠశాలలో నమోదు కార్యక్రమం లో సహిత విద్యా విభాగం జిల్లా కోఆర్డినేటర్ కె నారాయణ మాట్లాడుతూ భవిత కేంద్రం ద్వారా దివ్యాంగ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తుందని దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలు అందిస్తుందని అదేవిధంగా దివ్యాంగులకు స్కాలర్ షిప్ కూడా అందిస్తుందని ఆయన తెలియజేశారు.
కావున 18 సంవత్సరాల లోపు దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలో నమోదు అయ్యి భవిత కేంద్రం నందు తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
కావున దివ్యంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకొని తమ పిల్లల పేర్లను దివ్యాంగ చిన్నారుల పాఠశాల నమోదు కార్యక్రమంలో నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఈ సుధాకర్, ఐ ఈ ఆర్ టి ఎం కృష్ణ ప్రసాద్,డి రాముడు, దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
