vehicles | బంకుల్లో బారులు

vehicles | బంకుల్లో బారులు

ఏపీలో ఇంధ‌న కొర‌త‌
సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌
స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌కుఆదేశాలు

vehicles | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో ఇంధ‌న కొర‌త వేధిస్తోంది. ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా కర్నూల్, నంద్యాలలోని పలు పెట్రోల్ బంకుల ద‌గ్గ‌ర నోస్టాక్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. డీల‌ర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండ‌టంతో ఇంధ‌న కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న‌గ‌దు స‌ర్దుబాటు కాక నిలిచిపోయిన ఇంధ‌న స‌ర‌ఫ‌రా. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద టూ వీలర్స్, త్రీ వీలర్స్, కార్లు, లారీలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. దీనిపై అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్, సివిల్ సప్లైస్ అధికారుల్ని ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో ఫోనులో మాట్లాడారు. స్టాక్ లేని బంకుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని.. వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ స్టాక్ సమస్య ఉంటే వెంటనే ఆ బంక్ వారు 1967 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు.

Leave a Reply