మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : మలేరియా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హేమీమా చెప్పారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
దోమల వల్ల మలేరియా వ్యాధి వస్తుందని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుకోవాలని సూచించారు. మురికి నీరు ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
