మండల టాపర్‌గా నిలిచిన వంగ వెంకటకృష్ణ..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన వంగ వెంకటకృష్ణ పదవ తరగతి పరీక్షల్లో 569 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ఎలగడప గ్రామంలో ఆయనను ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ నర్సింగ్, అశ్విత రమేష్, ఉప సర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి. నరేష్ కుమార్, జీపీ వార్డు సభ్యులు, నాయకులు నాంపల్లి, భూమరాజం, లక్ష్మీరాజం తదితరులు వెంకటకృష్ణకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, పోషకులు పాల్గొన్నారు.

Leave a Reply